ఈరోజు మాడుగుల మండలంలో ఆవురువాడ పంచాయతీ లో ఉన్న 14 గ్రామాల జనసైనికులు అందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు అదే విధంగా జిల్లా కార్యదర్శి గుమ్మడి శ్రీరాం గారు, రోబ్బా మహేష్ గారు మరియు మాడుగుల మండల జనసేన నాయకులు శ్రీ గట్టిరెడ్డి శివాజీ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి శ్రీరాం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సున్నా అయితే మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి రెండు సున్నాలని మాడుగుల నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా సరైన రోడ్డు లేవని బూడి ముత్యాల నాయుడు గారు తక్షణమే మేల్కొని నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చక్కదిద్దాలని తెలియజేశారు. రోబ్బ మహేష్ గారు మాట్లాడుతూ జనసైనికులు కు అండగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అధికార పార్టీ నుంచి ఎటువంటి బెదిరింపులు వచ్చిన సరే నియోజకవర్గంలోని జనసేన నాయకులు అందరూ కూడా తక్షణమే వారికి అండగా నిలుస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అవురవాడి పంచాయతీ జన సైనికులు రిషి గంగాధర్ శ్రీను మహేష్ మరియు పలువులు మాట్లాడుతూ గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకువెళ్తామని రానున్న రోజుల్లో గ్రామం నుంచి అత్యధిక చేరికలు జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో భారీ చేరికలు కూడా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రామకృష్ణ గళ్ళ గణేష్ కెమిశెట్టి గణేష్ చింతలూరు మూర్తి సాయి గంగాధర్ అదే విధంగా ఔరవాడు పంచాయితీ 14 గ్రామాలు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది
2024-04-23 12:35:41తేది: 09-04-2024
2024-04-12 14:49:44తేది : 08-04-2024 సాయంత్రం
2024-04-12 14:44:52మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది
2024-04-03 10:44:40