• 9666632323
  • V.Madugula Constituency, Anakapalli Parliament, VSP.

News detail

Image Here

జనసేన అధినేత చేతులు మీదగా రాయపురెడ్డి కృష్ణ కు సత్కారం.

  • Date : 2022-10-31 14:00:31

అక్టోబర్ 15వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా అక్రమంగా అరెస్టై జైల్లో ఉండి బెయిల్ పై విడుదలైన 9 మందిని శనివారం నాడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో 9 మంది నాయకులను వారి కుటుంబ సభ్యులతో సహా కలవడం జరిగింది. ముందుగా తొమ్మిది మంది నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా పలకరించి అనంతరం వారికి సాలువలతో సత్కరించి అనంతరం అక్టోబర్ 15 న జరిగిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ తొమ్మిది మందిలో ఒకరైన మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో పార్టీ మరింత బలంగా తయారవ్వాలంటే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం యొక్క వైఫల్యాలు పై బలమైన పోరాటాలు చేయాలని మాడుగుల నియోజకవర్గoలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాడుగుల నియోజకవర్గంలో జనసైనికులు అందరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా కేంద్ర కార్యాలయానికి దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు .రాయపరెడ్డి కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి మాడుగుల ఆరాధ్యదేవత శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఫోటోను అందజేశారు. రాయపరెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో గల సమస్యల గురించి వివరించారు. జనసేన గెలుపు కోసం కచ్చితంగా అందరం కష్టపడి పనిచేసి మాడుగుల కోటపై జనసేన జెండాను ఎగరవేస్తామని రాయపరెడ్డి కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదండ్ల మనోహర్ గారు పాల్గున్నారు.

recent events
  • Image Here

    ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి MLA అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు నామినేషన్ వేయడం జరిగింది

    2024-04-23 12:35:41
  • Image Here

    తేది: 09-04-2024

    2024-04-12 14:49:44
  • Image Here

    తేది : 08-04-2024 సాయంత్రం

    2024-04-12 14:44:52
  • Image Here

    మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలో జనసేన, టీడీపి, బిజెపి ఉమ్మడి MP, MLA అభ్యర్థులు గెలుపు కోసం గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది

    2024-04-03 10:44:40